షర్మిల కొత్త పార్టీ పేరు ఇదేనట !

-

హైదరాబాద్ లో షర్మిల ఆత్మీయ సమావేశం ఇప్పుడు చర్చినీయంశంగా మారింది. నల్గొండ జిల్లా నేతలు, అభిమానులతో షర్మిల సమావేశంలో మాట్లాడుతూ నేను మాట్లాడడానికి రాలేదు వినడానికే వచ్చానని అన్నారు. మీరు చెప్పింది విని అర్ధం చేసుకోవడానికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. పిలవగానే వచ్చిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. మీ స్వస్థలాల్లోని పరిస్థితిని తనకు చెప్పమని షర్మిల కోరినట్టు తెలుస్తోంది.

రాజన్న రాజ్యంలో ప్రతి రైతు రాజులా బ్రతికాడని అందుకే తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని ఆమె పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు పై ఇప్పటికే షర్మిల సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. వైఎస్ఆర్.టిపీగా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. తక్షణం పార్టీ ప్రకటన ఉండక పోవచ్చు కానీ మార్చిలో పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు కోసం ప్రముఖ న్యాయవాది ద్వారా ఇప్పటికే ఈసీని కూడా షర్మిల సంప్రదించినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version