ఇక నుంచి వైయస్ఆర్ బిడ్డ పాలేరు బిడ్డ…ఇక్కడి నుంచే పోటీ – వైఎస్‌ షర్మిల

-

ఇక నుంచి వైయస్ఆర్ బిడ్డ పాలేరు బిడ్డ…ఇక్కడి నుంచే పోటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ షర్మిల. నిన్న పాలేరు లో YSR తెలంగాణ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు వైఎస్‌ షర్మిల. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలనకు పాలేరే పునాది రాయి. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఇండ్లు, పింఛన్లు ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. రైతులు, మహిళలు, యువతను ఆర్థికంగా నిలబెట్టే సర్కారును స్థాపిస్తామన్నారు.

వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికే YSR తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది. పాలేరు మట్టి సాక్షిగా మాటిస్తున్నా.. ఇక నుంచి వైయస్ఆర్ బిడ్డ పాలేరు బిడ్డ. ఇక్కడి నుంచే సంక్షేమ పాలనకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు షర్మిల. పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశయాలు, ఆశలు ఇమిడి ఉన్నాయి. పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట, శ్రమ దాగి ఉన్నాయి.వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు నుంచి పాలేరు బిడ్డ. ఇక్కడి బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలుపంచుకుంటా. హక్కుల కోసం పోరాడుతా. ప్రతి గడపకూ వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version