షర్మిల పార్టీతో హస్తం దోస్తీ?

-

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పార్టీ ఏడాది దాటేసింది…ఈ ఏడాది కాలంలో ఆమె…చాలావరకు అధికార టీఆర్ఎస్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు..కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం ఫైట్ చేస్తున్నారు. అలాగే నిరుద్యోగుల సమస్యలపై దీక్షలు చేస్తున్నారు..పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇన్ని చేస్తున్నా సరే షర్మిల పార్టీ బలోపేతం కావడం లేదు. పార్టీ పెట్టిన మొదట్లో కాంగ్రెస్ నుంచి వలసలు ఉంటాయని అంతా భావించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు షర్మిల పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది…కానీ అదేం జరగలేదు..ఏదో చిన్నాచితక నేతలు తప్ప…బడా నేతలు ఎవరు షర్మిల పార్టీలోకి రాలేదు. అయితే తెలంగాణ ప్రజలు ఇంకా షర్మిల పార్టీ వైపు చూడటం లేదని తెలుస్తోంది…టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్యే పోరు నడుస్తున్న సమయంలో..ప్రజలు ఆ మూడు పార్టీల మధ్యే ఉన్నారు. అంటే షర్మిల పార్టీ ప్రభావం పెద్దగా లేదని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడొక చిన్న అంశం ఉంది.

ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో వైఎస్సార్టీపీ…ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాస్త ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఆ పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నా సరే…గెలుపోటములని తారుమారు చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అది కూడా కాంగ్రెస్ పార్టీకి షర్మిల పార్టీ నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున జిల్లాలు ఈ రెండే…నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది..ఆ తర్వాత టీఆర్ఎస్ ఉందని సర్వేల్లో తేలింది. అయితే ఇప్పుడు ఈ రెండు చోట్ల బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.

ఇక ఈ రెండు జిల్లాల్లో షర్మిల పార్టీ ప్రభావం ఎక్కువ ఉంది. దీని వల్ల కాంగ్రెస్ కు నష్టం. అందుకే షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై కాంగ్రెస్ లో చర్చ నడుస్తుందట…కమ్యూనిస్టులతో పాటు షర్మిల పార్టీని కలుపుకుంటే..ఈ రెండు జిల్లాల్లో సత్తా చాటే ఛాన్స్ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క..ఇప్పటికే షర్మిల పార్టీతో పొత్తు విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీతో షర్మిల కలుస్తారో లేదో?

Read more RELATED
Recommended to you

Exit mobile version