వైఎస్సార్ బిడ్డకు కేసీఆర్ భయపడుతున్నాడని వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. లోటస్ పాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు వైఎస్ షర్మిల బయలు దేరింది. అయితే.. ఈ తరుణంలోనే.. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగింది.
అనంతరం షర్మిల మాట్లాడుతూ… తెలంగాణ రాష్ర్టంలో ప్రజాస్వామ్యం లేదు.. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు.ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ లు చేస్తున్నా రు… మీరు రాష్ట్రం లో జరుగుతున్న దానిపై దృష్టి పెట్టండని మోడీని కోరారు. కేసీఆర్ నియంత అని మరో సారి నిరూపణ అయ్యింది.. వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నాడన్నారు. అందుకే నన్ను ఆపుతున్నాడు.. ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని అనుకున్నాం.. ప్రజల సమస్యల మీద పో రాటం చేయాలని అనుకున్నామని చెప్పారు వైఎస్ షర్మిల.