స్వచ్ఛ భారత్ 2.0 నేడే ప్రారంభం…

-

గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడం, నీటిని కలుషితం చేయకూడదనే లక్ష్యాలతో 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారు. 2019 అక్టోబర్ 2 గాంధీజీ 150 జయంతి సందర్భంగా భారతదేశం ఓడీఎఫ్ ఫ్రీగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వచ్చభారత్ మిషన్ వల్ల గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇంటింటికి వచ్చి చెత్తసేకరణ చేయడం ప్రారంభం అయింది. తాజాగా రెండో విడతగా స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభం కానుంది. స్వచ్ఛభారత్ 2.0 ను నేడు ప్రధాని ఢిల్లీలో ప్రారంభించనుంది. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 2030 వరకు సమ్మిళిన అభివ్రుద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల గత ఆరేళ్లుగా ఎంతో మార్పు వచ్చింది. బహిరంగంగా చెత్త వేయడం తగ్గిపోయింది. డోర్ టూ డోర్ చెత్త సేకరించడం ప్రారంభం అయింది. దీంతో పాటు బహిరంగ మలవిసర్జన తగ్గపోయింది. దేశంలో మొత్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ఊపందుకుంది. దేశం మొత్తం 73 లక్షల టాయిలెట్ల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం రెండో దశలో మరుగుదొడ్ల నిర్మాణం మరింత ఊపందుకునేలా స్వచ్చభారత్ 2.0 సహాయపడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version