అందరి నోళ్ళు మూయించిన షారుక్ ఖాన్

-

షారుక్ ఖాన్ , దీపిక పదుకొనె నటించిన పఠాన్ సినిమా బేషరమ్‌ రంగ్‌’ అనే పాటపై  రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక  రాజకీయ నాయకుల నుంచి మొదలు కొందరు సినీ తారలు సైతం బహిరంగంగానే ఈ పాటను ట్రోల్ చేయడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఈ అంశం మారింది. ఇదే సమయంలో ప్రపంచ ప్రఖ్యాత ఎంపైర్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒక్కరే చోటు దక్కించుకొని కొంత మంది నోళ్ళు మూసుకొనేలా చేసారు.

అసలే విమర్శలు వస్తున్న సమయంలో తనకి అనుకోని వరంగా ఈ పేరు వచ్చింది. ఇంకాఈ జాబితాలో డెంజల్ వాషింగ్టన్, మార్లోన్ బ్రాండో, టామ్ హాంక్స్, కేట్ విన్స్‌లెట్ వంటి వారు ముందున్నారు. భారతదేశం నుండి వీరిలో చేరిన ఏకైక నటుడు షారుఖ్. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారూక్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది.

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒక్కరే ప్రఖ్యాత ఎంపైర్ మ్యాగజైన్ చోటు దక్కించు కోవడం తో రాబోయే తన పఠాన్ సినిమా కు కూడా హెల్ప్ అవబోతుంది. ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ కూడా రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version