రికార్డు సృష్టిస్తున్న షారుఖ్ “జవాన్”

-

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన జవాన్ మూవీ అంచనాలకు మించి థియేటర్ లలో ప్రదర్శితం అవుతూ కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ లు సాధించిన సినిమాగా అవతరించింది. ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగానే కలెక్షన్ లను సాధించి వెయ్యి కోట్లకు దగ్గరగా వెళుతోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా లోని జవాన్ మూవీ 4 మిలియన్ లు మార్కును దాటిందట. కానీ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మూడు ఇండియన్ సినిమాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయట. ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు షారుఖ్ ఖాన్ ఖాతాలో ఉండడం విశేషం.. అందులో ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన పఠాన్ మూవీ కాగా .. దానికి ముందు ప్రభాస్ నటించిన బాహుబలి 2 మూవీ ఆ ఘనత సాధించడం విశేషం.

ఇంకా కొన్ని రోజులు సినిమా థియేటర్ లలో ఉండే అవకాశం ఉండడం తో కలెక్షన్ లు మరింతగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు.

Read more RELATED
Recommended to you

Latest news