బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ బర్త్ డే ఇవాళ. షారుక్ పుట్టిన రోజు సందర్భంగా పఠాన్ మూవీ టీమ్ ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్‌కి కూడా క్రేజీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పఠాన్ టీజర్‌ని రిలీజ్ చేసింది. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేక ఎదురుచూస్తున్న షారుక్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇందులో షారుక్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది. కండలవీరుడు జాన్ అబ్రహం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
పఠాన్ టీజర్ ఆద్యంతం అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలతో అదిరిపోయింది. షారుక్ సిక్స్ ప్యాక్ రఫ్ లుక్, దీపికా పదుకొణె హాట్ ఎక్సోజింగ్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా షారుక్-జాన్ అబ్రహం మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 25, 2023న గ్రాండ్‌గా విడుదల కానుందీ మూవీ.