రాజకీయాల్లోకి శశికళ రీ ఎంట్రీ..ముహూర్తం ఖరారు !

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. జయలలిత హయాంలో ఒక వెలుగు వెలిగిన చిన్నమ్మ శశికళ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే మద్దతుదారులతో శశికళ భవిష్యత్తు రాజకీయం పైన కీలక మంతనాలు పూర్తి చేసినట్లు కూడా ఆమె అనుచరులు చెబుతున్నారు. అన్నాడీఎంకే స్థాపించి అక్టోబర్ 17వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తి కానుంది.

ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ శశికళ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇవాళ రాత్రి లోపు లేదా రేపు ఆమె రాజకీయ ఎంట్రీ పై కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి తన పొలిటికల్ ఎంట్రీపై… ప్రకటన చేస్తారని ఉన్నాయి. అయితే దీని పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. శశి కళ కు ఎఐడిఎంకె పార్టీ లో అస్సలు స్దానం లేదని… శశికల నటనకు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని మాజీ మంత్రి జయకూమార్ ఎద్దేవా చేశారు. అయినా శశికళను ప్రజలు..పార్టీ కేడర్ నమ్మాదని… పార్టీ జెండా వాడుకునే అర్హత అమెకు లేదని ఫైర్ అయ్యారు.