కేబీసీ 12 సీజ‌న్‌లో మొద‌టి క‌రోడ్‌ప‌తి ఈమె.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మీరు జ‌వాబులు చెప్ప‌గ‌ల‌రా ?

-

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి 12వ సీజ‌న్ ఇటీవ‌లే ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజా ఎపిసోడ్ నంబ‌ర్ 10న జ‌రిగింది. అందులో ఢిల్లీకి చెందిన న‌జియా వసీం అనే మ‌హిళ రూ.1 కోటి గెలుచుకుంది. దానికి చెందిన ప్రోమోను ఇప్ప‌టికే సోనీ టీవీ విడుద‌ల చేసింది. అందులో ఆమెను మంగ‌ళ‌వారం రాత్రి ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. ఇక బుధ‌వారం రాత్రి ఎపిసోడ్‌లోనూ ఆమెను ప‌లు ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారు. అయితే ఆమె ఇప్ప‌టికే రూ.1 కోటి గెలుచుకున్న‌ట్లు సోనీ టీవీ చెప్ప‌డంతో ఆమె ఈ సీజ‌న్‌కు గాను రూ.1 కోటి గెలుచుకున్న మొద‌టి కంటెస్టెంట్ అయింది.

she is first winner of kbc 12 can you answer these questions

ఇక న‌జియా వసీంను మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన కేబీసీ ఎపిసోడ్‌లో అడిగిన ప్ర‌శ్న‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1. కోల్డ్ బ్రూ, లాటె, ఎస్‌ప్రెసో ఇవ‌న్నీ ఏ పానీయానికి చెందిన ఉదాహ‌ర‌ణ‌లు ?
టీ, ఫ్రూట్ జ్యూస్‌, కాఫీ, ల‌స్సీ

2. రాకెట్ స్పోర్ట్స్‌లో స్కోర్ అనే ప‌దాన్ని వాడేందుకు కింద ఇచ్చిన ఏ ప‌దాన్ని ఉప‌యోగిస్తారు ?
హేట్‌, ల‌వ్‌, డౌన్, అప్

3. ర‌జ‌త్ శ‌ర్మ‌, సోనియా సింగ్‌, రాహుల్ క‌న్వాల్‌, సుమిత్ అవ‌స్థి.. వీరంద‌రూ ఏ వృత్తికి చెందిన‌వారు ?
ఆస్ట్రాల‌జీ, జ‌ర్న‌లిజం, మెడిసిన్‌, లా

4. దీదీ తేరా దీవ‌ర్ దీవానా అనే పాట‌లో మాధురీ దీక్షిత్ ధ‌రించిన చీర క‌ల‌ర్ ఏది ?
గ్రీన్‌, రెడ్‌, ఎల్లో, పర్పుల్

5. ఇస్లాంకు చెందిన 5 పిల్ల‌ర్ల‌లో కింది వాటిలో ఏది ఉండ‌దు ?
స‌లాత్, జ‌కాత్‌, హ‌డిత్, హ‌జ్

6. జంతారా అనే టౌన్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జార్ఖండ్‌, ఒడిశా, బీహార్‌, వెస్ట్ బెంగాల్

కాగా న‌జియా వసీంను అడిగిన మిగిలిన ప్ర‌శ్న‌ల‌కు చెందిన ఎపిసోడ్ బుధ‌వారం రాత్రి ప్ర‌సారం కానుంది. పైన తెలిపిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవే…

1. కాఫీ, 2. ల‌వ్‌, 3. జ‌ర్న‌లిజం, 4. ప‌ర్పుల్‌, 5. హ‌డిత్, 6. జార్ఖండ్

Read more RELATED
Recommended to you

Latest news