భర్తను వదిలేసి ప్రియుడి దగ్గరకు వెళ్లి పోసపోయింది ఓ లేడీ. భర్తను వదిలేసి రా అన్నాడు…. తీరా మోసం చేశాడని సంఘటన తాజాగా వెలుగు చూసింది. షమీనా అనే యువతికి మూడేళ్ల క్రితం ఖలీల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు రమేష్ అనే యువకుడితో షమీనా ప్రేమాయణం నడిపింది. పెళ్లయ్యాక కూడా ప్రతిరోజూ ఫోన్లో రమేష్, షమీనా ముచ్చట్లు పెట్టింది.

ఈ క్రమంలో.. తన వద్దకు తిరిగి వచ్చేయాల్సిందిగా కోరాడు రమేష్. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో.. భర్తని వదిలి షమీనా వెళ్లిపోయింది. తీరా వెళ్లాక పెళ్లికి రమేష్ నిరాకరించాడు. దీంతో అతడ్ని నిలదీశాడు వివాహిత. దాంతో ఆమెను వదిలించుకోవడం కోసం చంపాలని రమేష్ ప్లాన్ వేశాడు. ఓ చోటుకి తీసుకెళ్లి.. గాజు సీసాతో ఆమెను చంపేందుకు యత్నం చేశాడు. కేకలు వేయడంతో.. షమీనానుఅక్కడే ఉన్న స్థానికులు కాపాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. రమేష్‌ను అరెస్టు చేశారు పోలీసులు. కర్ణాటకలోని బళ్లారి సమీపంలో ఉన్న కొప్పళలో ఈ ఘటన చోటు చేసుకుంది.