ఆయన ఫోన్ వల్లే.. తన కెరీర్ మారిపోయింది అంటున్న శేఖర్ మాస్టర్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్ర హీరోల సినిమాలకు ఆయన ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. అటు బాలీవుడ్ హీరోల నుంచి కూడా శేఖర్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ గా పనిచేయడానికి కాల్ చేస్తూ ఉంటారు. ఇక తన పిల్లలను కూడా మంచి డాన్సర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే తన కూతురు ,కొడుకు కూడా మంచి డాన్సర్లుగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా యువ హీరోల కంటే సీనియర్ హీరోలకి ఎక్కువగా పని చేస్తున్న శేఖర్ మాస్టర్ అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటాడు.

ఇకపోతే చిరంజీవికి కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. శేఖర్ మాస్టర్ సర్కారు వారి పాట సినిమాలో కొన్ని స్టెప్స్ మహేష్ బాబు చేత చేయించి మరింత వైరల్ అయ్యాడు. దీనితో పారితోషకం కూడా భారీగానే పెంచారు. ఇదిలా ఉందిగా తాజాగా ఆయన తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకోవడం జరిగింది. తన భార్య హౌస్ వైఫ్ అని.. తన భార్యకు డాన్స్ గురించి ఎక్కువగా తెలియదు అని కూడా చెప్పుకొచ్చారు.. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, కానీ పెద్దలు కుధుర్చిన పెళ్లి అందుకే చేసుకోవాల్సి వచ్చింది అని కూడా తెలిపారు.

ఇక వివాహం జరిగిన తర్వాత ఆఫర్లు లేక ఆరు సంవత్సరాల పాటు ఎంతో స్ట్రగుల్ అనుభవించాను.. ఆ బాధ తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి కూడా వెళ్లిపోదామనుకున్నాను. ఆ సమయంలోనే అల్లు అర్జున్ నుంచి ఫోన్ వచ్చింది అంటూ తెలిపారు శేఖర్ మాస్టర్. అలా అలవైకుంఠపురంలో సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం లభించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది . ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఉన్నత స్థానానికి చేరుకున్నాను అంటూ శేఖర్ మాస్టర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version