మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు సాయంత్రం ముంబైలోని శివాజి పార్కు లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఉద్ధవ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మహా వికాస్ అఘాడీ కూటమిలోని పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. శివసేన కార్యకర్తలు, అభిమానులు తదితర నేతలు హర్ష ద్వానాల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఉద్దవ్ థాక్రే.. అనంతరం తన సభకు హాజరైన ప్రజలకు శిరసు వంచి నమస్కరించారు.
థాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్ థాక్రే చరిత్ర సృష్టించారు. ఉద్దవ్ తర్వాత శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఉద్ధవ్ ను గవర్నర్ అభినందించారు. కాగా, ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారోత్సవానికి ఆయా పార్టీల ముఖ్యనేతలు కుటుంబంతో కలసి హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కొందరు హాజరయ్యారు.