భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు..!

-

మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు గా ఉన్న శ్రీశైలం, వేములవాడ, యాదాద్రి ఇలా ఎక్కడిక్కడ భక్తులు శివుడి నామస్కరణతో పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పురాతన పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో భక్తలు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి కూడా అన్ని పుణ్యక్షేత్రాలలో భక్తుల రద్దీ నెలకొంది.

దీనితో ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. ఎక్కడా కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్టలో గురువారం శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణ మహాత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా శైవ నామస్మరణతో దద్దరిల్లుతున్నాయి. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్‌లో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

పట్టిసీమ పట్టిసాచలక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారీగా తరలి వచ్చారు. ఎక్కడిక్కడ భక్తులకు భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. కృష్ణా, ప్రకాశం, సహా పలు జిల్లాల్లో భక్తులు బారులు తీరారు. తెలంగాణాలోని ఖమ్మం, ఉమ్మడి జిల్లాల్లో భక్తులు బారులు తీరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version