ఇంకొక్కసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదు అన్న జగన్ .. విడదల రజని ఫుల్ హ్యాపీ

-

చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడుదల రజిని కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ కారులో రజని మరిది గోపి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా విడుదల వారి ప్రభని కోటప్పకొండ లో పెట్టి వస్తుండగా ఈ దాడి జరిగింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం కావడంతో పాటు ముందు ఇరువైపులా అద్దాలు పగిలిపోయాయి. కారులో ఉన్న గోపీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడి చేసింది తెలుగుదేశం పార్టీ వర్గీయులే అని ఆరోపిస్తున్నారు గోపి సహా రజినీ కుటుంబ సభ్యులు. టిడిపి పార్టీకి చెందిన బైరా వర్గీయులు ఈ దాడి చేశారని, ఒక ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగిందని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ దాడి విషయంలో కామెంట్ చేస్తున్నారు.

దీంతో రజనీ మరియు చిలకలూరి పేట వైకాపా కార్యకర్తలు ఎవరైతే టీడీపీకి చెందిన వారు దాడి చేశారు అని అనుకుంటున్నారో వారిపై పోలీస్ కంప్లైంట్ చేశారు. అయితే వరుసగా వైసిపి పార్టీకి చెందిన నాయకుల పై దాడులు జరగడం తో జగన్ ఫుల్ సీరియస్ అయినట్లు సమాచారం. తోట త్రిమూర్తులు పై చెప్పులు దాడి తాజాగా విడుదల రజిని కారుపై రాళ్ల దాడి ఘటన గురించి తెలుసుకున్న వైయస్ జగన్ పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీలో టాక్.

 

ప్రజాప్రతినిధులను కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకొకసారి ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగకుండా చూడాలని మళ్లీ ఇటువంటి ఘటనలు జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని జగన్ వార్నింగ్ ఇచ్చాడు అని సమాచారం. ఇదే తరుణంలో విడుదల రజిని కి జగన్ ఫోన్ చేసి దాడి చేసిన వారికి కచ్చితంగా బుద్ధి చెబుదాం అని భరోసా ఇవ్వడంతో రజిని ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు పార్టీలో టాక్. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని ఇచ్చిన కంప్లైంట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version