టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే పోస్టరును వదిలింది చిత్ర బృందం. మహేష్ బాబు.. చాలా బలంగా ఓ విలన్ కొడుతూనే ఫోజును ఈ పోస్టర్ ద్వారా ఫ్యాన్స్ కు చూపించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్టేడ్ తో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో ఈ పోస్టరు ను విడుదల చేశారు. కాగా ఉగాది కానుకగా ఏప్రిల్ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నారు.
Wishing you all a happy #MahaShivaratri! May the ever benevolent Lord Shiva bring strength and abundance! Let good conquer all evil! 🙏 pic.twitter.com/PnNeo5HbHE
— Mahesh Babu (@urstrulyMahesh) March 1, 2022