ఆ స్టార్ హీరో కారణంగా గెస్ట్ రోల్స్ కే పరిమితమైన శివరాజ్ కుమార్..!

-

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ వేద సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వేద సినిమా ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో పాన్ ఇండియా సినిమాగా రానున్న నేపథ్యంలో తెలుగులో కూడా ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేపట్టారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో చాలా గ్రాండ్గా నిర్వహించగా బాలకృష్ణ కూడా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వేద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ పాన్ ఇండియాతో పాటు స్టార్ హీరో అయ్యుండి కూడా గెస్ట్ పాత్రలు చేయడంపై పలు వ్యాఖ్యలు చేశారు.

శివ రాజకుమార్ మాట్లాడుతూ.. నాకు ఇటీవల మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. చిన్న పాత్రలైనా సరే నా క్యారెక్టర్ తగ్గట్టుగా వస్తున్నాయి.. కాబట్టి చేస్తున్నాను.. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా కాదంటారా? అందుకే జైలర్ సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకున్నాను.. బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా నేను చిన్న పాత్ర పోషించాను. నాకు ధనుష్ అంటే ఇష్టం .. అందుకే అతని సినిమా కెప్టెన్ మిల్లర్ లో కూడా చేస్తున్నాను. తెలుగులో కూడా చేయమని కొంతమంది కథలు వినిపిస్తున్నారు.. నచ్చితే కచ్చితంగా చేస్తాను.. బాలకృష్ణ కూడా కలిసి చేద్దాం అని అన్నాడు.. అందుకే బాలకృష్ణ కోసమైనా నేను గెస్ట్ రోల్స్ చేస్తాను అంటూ తెలిపారు శివరాజ్ కుమార్.

అలాగే పాన్ ఇండియా స్టార్స్ పై కూడా మాట్లాడుతూ.. కన్నడ, తెలుగు రెండు పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. పాన్ ఇండియా స్టార్స్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. అన్ని భాషలు నేర్చుకోవాలి.. నేను కూడా తెలుగు కొద్దిగా మాట్లాడుతున్నాను. అంటూ చెప్పుకొచ్చారు శివరాజ్ కుమార్

Read more RELATED
Recommended to you

Exit mobile version