ఎన్నికల తర్వాత ఫిరాయింపులు కూడా జోరందుకున్నాయి. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకొంతమంది సీఎం రేవంత్ రెడ్డి తో సైలెంట్ గా చెయ్యాల్సింది చేస్తున్నారు. దానం నాగేందర్ మరో అడుగు వేసి ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు అయితే ఫిరాయింపులకే ఇది పరాకాష్టగా చెప్పుకోవాలి. దానం పై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాక్ తగిలింది.
ఇక వివరాల లోకి వెళితే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన అనర్హత పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ మేరకు దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేశారు. మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఊరట ఎప్పుడు కలుగుతుందో చూడాలి.