పెళ్లి అయి కొత్త భర్తతో సంతోషంగా ఉండాల్సిన ఒక యువతి.. భర్తతో పాటు తల్లి దండ్రలుకు షాక్ ఇచ్చింది. పెళ్లి అయి నెల కూడా కాకుముందే.. తన ప్రియుడితో జంప్ అయింది. అంతే కాకుండా.. ఆ ప్రియుడిని రెండో వివాహం చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. కాగ తిరువణ్ణామలై జిల్లాలోని వేంగికాల్ గ్రామానికి చెందిన ఒక యువతి అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఆ గ్రామ పెద్ధల సమక్షంలో యువతి తల్లి దండ్రులు అంగ రంగ వైభవంగా వివాహం చేశారు.
అయితే పెళ్లి తర్వాత తన భర్తతో ఎప్పుడూ మౌనంగానే ఉండేదట. అయితే పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత.. ఆ యువతి ఆకస్మాతుగా ఇంట్లో కనిపించలేదు. దీంతో భర్త తో పాటు యువతి తల్లిదండ్రులు.. ఆమె కోసం తీవ్రంగా గాలించారు. ఇంతలోనే వారికి షాకింగ్ విషయం తెలిసింది. ఆ యువతి తన ప్రియుడిని రెండో వివాహం చేసుకుంది. దీంతో తన భర్త, కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ కు గురి అయ్యారు. పెళ్లి అయి నెల గడవక ముందే రెండో పెళ్లి చేసుకోవడంతో భర్త కంగుతిన్నాడు. కాగ ఆ యువతి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ విషయం బయటకు వచ్చింది.