ఉక్రెయిన్ పై రష్యా బలగాలు.. గత పదమూడు రోజుల నుంచి యుద్ధం చేస్తునే ఉంది. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్ తో పాటు పలు ప్రధాన నగరాలపై రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. భారీ స్థాయిలో క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్ పై దాడులు చేస్తుంది. అయితే ఉక్రెయిన్ కూడా రష్యా దాడులను సమర్థవంతం గా ఎదుర్కొంటుంది. రష్యా క్షిపణులు, రాకేట్ లంఛార్లను ఉక్రెయిన్ బలగాలు తీవ్ర ప్రతిఘటిస్తున్నాయి.
అంతే కాకుండా పలు చోట్ల రష్యా బలగాలపై ఉక్రెయిన్ బలగాలపై ప్రతి దాడులు కూడా చేస్తుంది. ఈ దాడులలో ఇప్పటికే ఒక రష్యా మేజర్ జనరల్ మృతి చెందారు. తాజా గా మరోసారి ఉక్రెయిన్ బలగాలు చేసిన ప్రతి దాడిలో రష్యాకు చెందిన మరో మేజర్ జనరల్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
తమ బలగాలు ఖర్కివ్ నగరం సమీపంలో రష్యా బలగాలపై దాడులు చేశాయని తెలిపారు. ఈ దాడుల్లో రష్యా 41వ ఆర్మీ బెటాలియన్ అధిపతి, డిప్యూటీ కమాండర్, మేజర్ జనరల్ విటాలి గెరాసిమోన్ మృతి చెందినట్టు తెలిపారు. ఈ దాడిలో మరి కొంత మంది సైనిక అధికారులు కూడా మృతి చెందారని తెలిపారు.