హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది..సాదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టే ఇచ్చింది తెలంగాణ హైకోర్టు..సాదా బైనామాలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది..ప్రభుత్వం తీసుకువచ్చిన భూ క్రమబద్దీణకరపై దాఖలైన పిటిషన్లపై విచారణకు స్వీకరించిన న్యాయస్థానం..రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా అందిన దరఖాస్తులను పరిశీలంచవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది..అయితే కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాకముందు వచ్చిన దరఖాస్తులు సరిశీంచవచ్చని న్యాయస్థానం తెలిపింది..అయితే కొత్త రెవెన్యూ చట్టం అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిందని కోర్టుకు ఏజీ తెలిపారు..అక్టోబర్ 10 నుంచి 29 ఇప్పటి వరకూ 2,26,693 దరఖాస్తులు వచ్చాయని..అక్టోబర్ 29 నుంచి నిన్నటి వరకూ 6,74,201 దరఖాస్తులు వచ్చాయి న్యాయస్థానానికి తెలిపారు ఏజీ..2,26,693 దరఖాస్తుల క్రమబద్ధీకరణపై తుది నిర్ణయం కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది..ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి ఏజీకి రెండు వారాల సమయం ఇచ్చింది..