తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్..2వేల మందికి వీఆర్ఎస్ !

-

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ ఆర్టీసలో స్వచ్చంధ ఉద్యోగ విరమణ ప్రతిపాదన ఆలోచన ఉందని… క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు వీఆర్‌ఎస్‌ ఇస్తే రాజీనామా చేస్తామని పలువురు ఉద్యోగులు ముందుకొచ్చారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటన చేశారు.

ఇప్పటి వరకు 2 వేల మంది అందుకు ముందుకు వచ్చారని.. వారు సంతకాలు కూడా చేశారని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. అయితే.. సంబంధిత ప్యాకేజీపై ఇంకా దృష్టి పెట్టలేదని… విధి విధానాలూ రూపొందిచలేదని చెప్పారు. సంస్థ ఆదాయంలో 46 శాతం జీత భత్యాలకే పోతుందని.. తెలిపారు.

ప్రస్తుతం సంస్థకు 65 నుంచి 68 శాతం మధ్య ఆక్యూపెన్సీ వస్తోందని చెప్పారు. దానిని 75 శాతం నుంచి 80 శాతానికి చేర్చితే.. ఆదాయం మరింతగా పెరుగుతుందని స్పష్టం చేశారు. డీజిల్‌ ధరల పెంపు సంస్థపై పెనుభారం మోపుతోందని సజ్జానర్‌ అన్నారు. త్వరలోనే కొత్త బస్సులు కొనాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version