ఎయిడ్స్… ఈ పేరు చెప్తేనే చాలా మందికి ఒక దడ. దీనికి మందు లేదు అనే విషయం అందరికి తెలుసు. ఏళ్ళ తరబడి ఈ వ్యాధికి మందు కనుక్కోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. అయితే ప్రత్యేకమైన చికిత్స ద్వారా దీనికి పరిష్కారం కనుగొన్నారు వైద్యులు. లండన్‌కి చెందిన ఆడమ్ క్యాస్టిల్లెజో… తనకు HIV సోకిన 30 నెలల తర్వాత దాని నుంచి విముక్తి పొందాడు.
అతనికి మందుల వలన అది నయం కాలేదు. కణజాల ట్రీట్‌మెంట్ ద్వారా రోగం నయం చేసారు వైద్యులు. అతనికి కాన్సర్ ఉన్న నేపధ్యంలో వైద్యులు ఈ వైద్యం చేసారు. ఆ క్రమంలో HIV నయమైందని లాన్సెట్ HIV జర్నల్ ప్రకటించింది. సదరు యువకుడికి ఎవరో ఒక దాత కణజాలాన్ని ఇచ్చారు. ఆ దాతకు ప్రత్యేక మైన జన్యువులు ఉండటంతో వాటికి HIV నుంచీ కాపాడే లక్షణం ఉంది.
2011 తిమోతీ బ్రౌన్ అనే బెర్లిన్ పేషెంట్ తొలిసారిగా ఎయిడ్స్ నుంచి విముక్తి పొందాడు. ఆ తర్వాత మళ్ళీ ఇతనికి నయం చేసారు వైద్యులు. ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి అతను సిద్దమయ్యాడు. ప్రస్తుతం అతని ఇంటర్వ్యు కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ఇంటర్వ్యులో సంచలన విషయాలు బయటపడతాయో లేదో చూడాలి.