తెలంగాణలో గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. ఈ నెల 27న పోలింగ్ తేదీ ఉండటంతో ఆ రోజు ఎమ్మెల్సీ ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇచ్చింది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల విషయంలోనూ సీఈవో కీలక సూచనలు చేశారు.
ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని సీఈవో (ప్రధాన ఎన్నికల అధికారి) కోరారు. షిఫ్టుల సర్దుబాటు, ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలని సీఈవో కోరారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా వరంగల్-ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.