షాకింగ్; మటన్ కూరలో పడి బాలుడు మృతి…!

-

అనకూడదు గాని అద్రుష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది అన్నట్టు దరిద్రం ఎదురైతే ఎవరు మాత్రం ఎం చేస్తారు చెప్పండి. ఊహించని పరిణామాలతో ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. తాజాగా ఒక బాలుడు మరణించిన విధానం చూస్తే నిజంగా కర్మ అనుకోవడమే. అవును ఈ స్టొరీ చదివితే మీకు అదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఊహించని పరిణామం అది…

కామారెడ్డి జిల్లా కేంద్రం మదాంగపల్లిలో హైదరాబాద్‌కు చెందిన గౌతమి, అర్జున్‌ దంపతులు, వారి కుమారుడు రోహన్‌ బంధువుల దశదిన కర్మకు హాజరయ్యారు. పెద్దలు అందరూ విషాదంలో ఉంటే పిల్లలు అందరూ సందడి సందడిగా ఆడుకుంటున్నారు. ఇంతలో అయిదేళ్ళ రోహిత్ హుషారుగా ఆడుకుంటున్నాడు. వంటలు చేసే ప్రాంతం చుట్టూ సందడి సందడిగా పరుగులు పెడుతున్నాడు.

ఇంటి ముందర పెద్ద గిన్నెలో మటన్ కూర వండుతున్నారు. పరుగు పరుగున వెళ్ళిన రోహన్ వెళ్లి ఆ కూరలో పడ్డాడు. అంతే ఒంటి నిండా తీవ్ర గాయాలు. వెంటనే బాలుడ్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. దీనితో ఈ ఘటన విషాదంలో విషాదం అయింది. ఎవరో కర్మకు వెళ్ళడం ఏంటీ ఈ విధంగా జరగడం ఏంటీ…?

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version