కరోనా వచ్చి ప్రజలంతా కష్టాలు అనుభవిస్తుండగా, ఉపాధిలేక కూలీపనులు చేసుకునే వారు, అద్దెకున్న ఇళ్లకు కిరాయిలు కట్టలేక ఎందరో నానా అవస్దలు పడుతున్నారు.. ఇప్పటికే కిరాయి దారులను ఇబ్బందులు పెట్టవద్దని అధికారులు చెప్పగా వినే ఇంటి ఓనర్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ.. ఇక అందరికి కావలసింది డబ్బు.. కానీ ఆ డబ్బు వచ్చే మార్గాలే మూసుకుపోగా ఎవరైనా ఏం చేస్తారు.. ఇకపోతే ఇంటి అద్దె చెల్లించలేని స్దితిలో ఉన్న కిరాయిదారులపై ఇంటి యజమానులు జాలి చూపడం లేదు. అద్దె కట్టాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని భయపెడుతున్నారు..
ఇంతవరకు సరే కానీ కర్ణాటకలో ఏకంగా ఓ ఇంటి యజమాని కాల్పులకు తెగబడ్డాడు. ఆ వివరాలు తెలుసుకుంటే.. కర్ణాటకలో ఉన్న బెళగావి జిల్లాలోని చికోడి పట్టణంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శ్రీమంత్ దీక్షిత్ అనే వ్యక్తి ఉపాధిలేక గత మార్చి నుండి ఇంటి అద్దె చెల్లించడం లేదట. ఈ క్రమంలో అతను ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు కరెంట్ ఫ్యూజ్ లాక్కొని వెళ్లగా, దీక్షిత్ ఇంటి యజమానితో గొడవపడ్డాడట. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని తుపాకీతో గాల్లో కాల్పులు జరుపగా, ఆ కాల్పుల దాటికి ఇంటి పైకప్పు ధ్వంసమైంది.
అంతే కాకుండా వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడంతో పోలీసులు యజమానిని అరెస్టు చేసినట్లు తెలిసింది.. అదృష్టం బాగుండి ఎవరి ప్రాణాలకు హాని జరగలేదు కానీ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎలా.. బ్రతికి ఉంటే అద్దె ఈరోజు కాకుంటే మరెప్పుడైనా వసూలు చేయవచ్చూ.. ప్రాణాలు పోతే తీసుకురాలేం కదా అని అంటున్నారట కొందరు..