రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పదవి విరమణ చేసి కాంట్రాక్ట్ పై పని చేస్తున్న 6729 మంది ఉద్యోగులను తాజాగా… రేవంత్ రెడ్డి సర్కార్ తొలగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి కీలక అధికారులు కూడా ఉన్నారు. తొలగించిన వారిలో ఎవరి అవసరమైన ఉంటే మళ్లీ నోటిఫికేషన్ వేసి తీసుకుంటామని పేర్కొంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక ఈ కాంట్రాక్టు ఉద్యోగులను తీసేయడంతో కొత్తగా 6000 ఉద్యోగులు భర్తీ చేసేందుకు వెసులుబాటు కల్పించుకుంది రేవంత్ రెడ్డి సర్కార్.