స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ లు వాడుతుంటారు.. సినిమా చూస్తున్నా, సంగీతం వింటున్నా అందరం ఇయర్‌ఫోన్స్ వినియోగిస్తాం. ఇవి జీవనశైలిలో ముఖ్యమైన భాగంగా మారాయి.. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వినికిడి సామర్థ్యంపై ప్రభావం చూపడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇయర్‌ఫోన్ లను ఉపయోగించే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం… వాటి గురించి తెలుసుకుందాం..
హెడ్‌ఫోన్స్‌ని ఎక్కువ సేపు ఉపయోగిస్తే మెదడుపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి, ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై ప్రభావం చూపుతాయి. ఇయర్‌ఫోన్‌లు ఎక్కువగా వాడటం వల్ల చాలా సార్లు సౌండ్ భ్రమ ఉంటుంది.ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చెవులపై ప్రభావం పడటమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.ఇది హృదయ స్పందన రేటును వేగవంతం చేస్తుంది.
చాలా సార్లు వ్యక్తులు హెడ్‌ఫోన్ లను ఒక్కోసారి మార్చుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇయర్‌ఫోన్ స్పాంజ్ ద్వారా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపస్తుంది. ఈ పరిస్థితి లో చెవిలో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల చెవి నరాల పై ఒత్తిడి పడడం తో పాటు సిరల్లో వాపు వచ్చే అవకాశం ఉంటుంది. వైబ్రేషన్ కారణంగా వినికిడి కణాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి.. అంతే కాదు తలలో నరాల పై కూడా ప్రభావం చూపించవచ్చు నని నిపుణులు అంటున్నారు.. ఇది చదివిన తర్వాత కూడా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే మీ ప్రాణాల ను మీరే తీసుకున్న వారవ్వుతారు..