రూ.100 కడితే 14 లక్షలు.. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో…!

-

మీరు ఏ రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడిని పొందాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక దీని కోసం చూడాల్సిందే..! పోస్టాఫీస్‌ లో పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆకర్షణీయ రాబడిని ఎంతో ఈజీగా పొందొచ్చు. మరి పోస్ట్ ఆఫీస్ అందించే ఆ స్కీమ్ గురించి…. స్కీమ్ వివరాల గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే లక్షల్లో లాభం ఉంటుంది. ఈ స్కీమ్ పేరు సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.

సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్:

ఈ స్కీమ్ లో మంచిగా డబ్బులు పెట్టుకోవచ్చు. చాలా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా అవుతుంది. పైగా మంచి రిటర్న్స్ కూడా వస్తాయి.

సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు:

ఈ స్కీమ్ కి మంచి ఆదరణ వుంది. ఈ స్కీమ్ లో చేరితే మంచిగా డబ్బులు వస్తాయి. మెచ్యూర్ పీరియడ్ అయ్యాక సదరు వ్యక్తికి రూ.14 లక్షలను పొందొచ్చు. రెండు మెచ్యూర్ పీరియడ్లు ఉంటాయి. ఒకటి 15, మరొకటి 20 సంవత్సరాలుగా వుంది. 15 ఏళ్ల పాలసీని ఎంచుకున్నట్లయితే 6,9,12 సంవత్సరాల్లో పాలసీ మొత్తంలో 20 శాతం చొప్పున ఇస్తారు. అదే 20 ఏళ్ల పాలసీ ఎంచుకుంటే 8,12,16 సంవత్సరాల్లో పాలసీ మొత్తం 20 శాతం చొప్పున ఇస్తారు. మిగిలిన 40 శాతం, బోనస్‌తో మెచ్యూరిటీ అయిపోయాక ఇస్తారు.

సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కి కావాల్సిన అర్హతలు:

ఈ స్కీమ్ లో చేరాలంటే వ్యక్తి వయస్సు 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉండాలి.
మెచ్యూర్ పీరియడ్ అయ్యాక సదరు వ్యక్తికి రూ.14 లక్షలు వస్తాయి.
భారతీ పౌరుడు అయ్యి ఉండాలి.

ఎంత కట్టాలి..?, ఎంత వస్తుంది..?

95 రూపాయల చొప్పున రోజూ కడితే లక్షల్లో వస్తాయి. 25 వయసున్న వ్యక్తి 20 ఏళ్ల పాలసీని తీసుకుంటే మొత్తంగా రూ.7 లక్షల వరకు పే చెయ్యాలి. రోజుకి 95 అంటే ఇది నెలకు రూ.2,850. ఆరు నెలలకు రూ.17,100. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చే సరికి మీ చేతికి బోనస్‌తో పాటుగా మొత్తం రూ.14 లక్షల వరకు ఇస్తారు. 20 ఏళ్ల పాలసీని సెలక్ట్ చేస్తే 20 శాతం చొప్పున 8,12,16వ సంవత్సరాల్లో రావాలి. 1.4 లక్షల రూపాయల చొప్పున మీకు 8,12,16 సంవత్సరాల్లో వస్తాయి. 20వ సంవత్సరం 40 శాతం అంటే 2.8 లక్షల రూపాయలు. మొత్తం 7 లక్షల రూపాయలు. బోనస్ ఉంటుంది. ఇది సంవత్సరానికి రూ.48 వేల చొప్పున ఉంటుంది. ఇరవై ఏళ్ళల్లో 6.72 లక్షలు. అంటే మొత్తంగా 13.72 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version