దేశంలో ప్రతి నెలా చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయని అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగా డొమెస్టిక్,కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచటం లేదా తగ్గించటం చేస్తుంటాయి. తాజాగా కంపెనీలు డిసెంబర్ నెలకు సంబంధించిన రేట్లను మరోసారి సవరించాయి.
ఈ మేరకు డిసెంబర్ 1, 2024 నుంచి మార్పులు చేసిన ధరలు అమలులోకి వచ్చాయి.ఆదివారం నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. కమర్షియల్ వినియోగదారులు ఉపయోగించే 19 కేజీల సిలిండర్ల ధరను రూ.16.50 మేర పెరిగాయి.దీనికి ముందు నవంబర్ నెలలో సైతం కంపెనీలు ఈ సిలిండర్ల రేట్లను పెంచిన విషయం తెలిసిందే.ఇదే క్రమంలో కంపెనీలు జెట్ ఇంధన ధరలను సైతం పెంచినట్లు సమాచారం.వరుసగా 5వ నెల కూడా చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.