వివిధ కారణాల వలన మానవులకు ఎంతగానో నచ్చే బంగారం ధరలు కొన్ని సార్లు తగ్గుతూ ఉండడం మరికొన్ని సార్లు పెరగడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు ఈ బంగారం ధరలపైన ఎప్పుడూ ఒక కన్నేసి ఉంటారు. గ్రాముకు కొంత తగ్గినా సరే వెంటనే షాప్ లలోకి వెళ్లి ఎక్కువ మొత్తం లో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మధ్యన ఎప్పుడూ పెరగని విధంగా ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. 22 క్యారట్ ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1400 పెరిగిందట. అంటే ఒక గ్రాము మీద రూ. 140 లు ఒక్క రోజులో పెరగడం అంటే మాములు విషయం కాదు. అదే విధంగా 24 క్యారట్ ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 1530 పెరిగి రూ. 60440 గా ఉంది.
మరి ఎవరైనా బంగారాన్ని కొనదలుచుకుంటే కొన్ని ఇప్పుడే కొనడం మంచిదని బులియన్ మార్కెట్ లు చెబుతున్నాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.