WORLD RECORD: అరుదైన రికార్డు సాధించిన హిట్ మ్యాన్… 300 సిక్సర్ల క్లబ్ లోకి ఎంట్రీ !

-

ఇండియా ప్రస్తుతం స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో గిల్ మరియు విరాట్ కోహ్లీ వికెట్ లను కోల్పోయింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వికెట్ ఇవ్వకుండా రన్ రేట్ డ్రాప్ అవకుండా మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. మొదటి మ్యాచ్ లో డక్ అవుట్ అయినా , ఆ తర్వాత మ్యాచ్ లో సెంచరీ మరియు ఇప్పుడు అర్ద సెంచరీ సాధించి కెప్టెన్ గా జట్టుకు తనేమో చేయగలనో చేస్తున్నాడు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును చేరుకున్నాడట. ఇన్నింగ్స్ 9 వ ఓవర్లో హరీష్ రాఫ్ బౌలింగ్ లో ఆఫ్ స్టాంప్ మీదుగా కొట్టిన సిక్స్ తో అంతర్జాతీయ వన్ డే లలో సిక్సులు కొట్టిన మూడవ ఆటగాడిగా రోహిత్ శర్మ ఆ క్లబ్ లోకి చేరిపోయాడు.

ఇంతకు ముందు వన్ డే లలో షాహిద్ ఆఫ్రిది 351 సిక్సులు, క్రిస్ గేల్ 331 సిక్సులు కొట్టి ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.. రోహిత్ ఇదే విధంగా ఆడితే ఈ వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ రికార్డ్ అయినా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version