తమిళనాడుకు చెందిన లేడీ సూపర్ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సౌత్‌లో మంచి ఫాలోంగ్ ఏర్పర్చుకుంది. నయనతారకు వయసు పెరుగుతున్నా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. తమిళంలోనే కాకుండా.. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలలో కూడా ఆమె భారీ స్థాయిలో అభిమానులను సంపాధించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఒక వైపు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మరో వైపు మంచి పేరు సంపాధించుకుంటుంది. అయితే ప్రస్తుతం నయనతార రెమ్యూనరేషన్ అందరిని ఆసక్తిపరుస్తుంది.
ప్రస్తుతం ఈమె విజయ్ తో `బిగిల్` షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు నయనతార సుమారు 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు నయనతారదే అత్యధిక పారితోషికమట. బాలీవుడ్ హీరోయిన్లు అయిన ఆలియా భట్, దీపికా పదుకొనే వంటి వారే 4 కోట్లతో ఆగిపోయారు. కానీ సౌత్ హీరోయిన్ నయనతార వాళ్లను మించిపోయి 5 కోట్ల వరకు తన రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్‌కు ఎదిగిపోయింది.
అయితే ఈ సినిమాలో నయనతార తనంతట తానుగా సినిమాను భరించగలిగే బ్యాంకింగ్ స్టార్‌గా మారినందున, ఆమె రెమ్యూనరేషన్ రూ .5 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఇక హీరో విజయ్ కూడా ఈ సినిమా కోసం రూ.30 కోట్లకు పైనే తీసుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరి కాబినేషన్‌లో రాబోతున్న `బిగిల్` చిత్రం దీపావళికి విడుదల కానుంది. అలాగే దాదాపు రూ.200 కోట్ల దాకా ఈ సినిమా బిజినెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుతం నయనతార తన తెలుగు చిత్రం సైరా నరసింహ రెడ్డి, మలయాళ చిత్రం లవ్ యాక్షన్ డ్రామా విడుదల కోసం ఎదురుచూస్తోంది.