టీవీ9 యాంకర్ గా దేవి నాగవల్లి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈమె యాంకర్ గా కంటే హీరోలతో జరిపే డిబేట్లతోనే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఒకానొక సమయంలో విజయ్ దేవరకొండ తో డిబేట్ నడిపిన ఈమె ఆ తర్వాత విశ్వక్ సేన్ తో కూడా మరింత డిబేట్ కి దిగింది. ఈ క్రమంలోనే బాగా పాపులారిటీని సంపాదించుకున్న దేవీ నాగవల్లి కి ఎంతోమంది రాజకీయ నాయకుల సపోర్టు కూడా లభించింది. ముఖ్యంగా బిగ్ బాస్ 4 లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె హౌస్ లో టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలుస్తుంది అని అనుకుంటే.. హౌస్ లో మాత్రం నిలవకపోగా తొందరగా బయటకు వచ్చేసింది.
ఇక తర్వాత సైలెంట్ గా తన పని తాను చేసుకున్న ఈ కాంట్రవర్షల్ యాంకర్ .. విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం ప్రమోషన్ లో టీవీ9 స్టూడియో నుండి విశ్వక్ సేన్ ను బయటకు పొమ్మనడం తర్వాత దానిని సినిమా ఆటోగ్రఫీ.. మినిస్టర్ తలసాని వరకు తీసుకెళ్లడం ఎంత పెద్ద చర్చకు దారితీసిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక అల్లు అరవింద్ సీన్ లోకి ఎంటర్ ఇచ్చి వివాదానికి పులిస్టాప్ పడేలా చేశారు. ఇక ఇదంతా పక్కన పెడితే దేవి నాగవల్లి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి కి చెందిన రాజమండ్రి. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే.. తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే ప్రముఖ స్వర్గీయ దాసరి నారాయణరావుకు.. దేవీ నాగవల్లి బంధువవుతారట. ఇక ఈ విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి.
దేవి నాగవల్లి తండ్రి దాసరి నారాయణరావుకి మేనల్లుడు అవుతారట. ఆ రకంగా చూసుకుంటే దేవి నాగవల్లి దాసరి నారాయణరావుకు మనవరాలు అవుతుంది. కానీ ఇతని రిఫరెన్స్ ను తీసుకొని దేవి నాగవల్లి ఎక్కడా కూడా వాడుకోలేదు. ఇక అలాగే ఓ సందర్భంలో చిరంజీవి గారు కూడా దాసరి గారికి మనవడు అవుతారని చెప్పారు. అలా చూసుకుంటే దేవీ నాగవల్లితో మెగా ఫ్యామిలీకి కూడా మంచి బంధుత్వం ఉన్నట్లే.. ఇకపోతే తన తాత బంధువుల రెఫరెన్స్ ను ఆమె ఎప్పుడు ఉపయోగించుకోకపోవడం గమనార్హం.