తెలుగు సినిమా పరిశ్రమలో అతనో పెద్ద మాస్ డైరక్టర్. తాను పెళ్లి చేసుకొని చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా కూడా ఇప్పటిదాకా పిల్లలు పుట్టలేదు. సరేలే కొన్ని రోజులు ఎంజాయ్ చేయటానికి, పిల్లలు ఇప్పుడే వద్దని, ప్లాన్ చేస్తున్నట్లు చాలా మంది భావించారు. మరి కొందరు ఇద్దరిలో ఎవరో ఒకరికి లోపం ఉండొచ్చని ఫిల్మ్ సర్కిల్స్ సొసైటీలో గుస గుసలాడు కున్నారు.
కాని రీసెంట్ గా జరిగిన ఫంక్షన్ లో ఎవరో బాగా దగ్గరైన వారు ఇంకా పిల్లలు పుట్టలేదు ఏంటి అనే సరికి ఆ డైరెక్టర్ చెప్పిన కారణం విని అవాక్కు అయ్యారట. ఆయన మరియు ఆయన భార్య ఇద్దరూ అస్సలు పిల్లల్ని కనే ఆలోచనే అస్సలు లేదట. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారని అడగగా షాకింగ్ రిప్లై ఇచ్చారట.
పిల్లలను పుట్టిన తర్వాత చాలా ఖర్చు వుంటుంది,అలాగే వారిని పెంచడంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాగే వారి చదువులు చెప్పించడం, మళ్లీ వాళ్ల కెరియర్ ను నిర్మించడం వంటి పనులు కష్టం తోను, ఖర్చు తోను కూడుకొని ఉంటాయి. ఇంత కష్టపడి వారిని పెంచినా వాళ్ళు మనల్ని ముసలి వయస్సు లో పట్టించుకునే అవకాశం లేదని అందుకోసం వారిని కని పెంచాల్సిన అవసరం లేదని అన్నాడట.ఇది విన్న వారు ఆయన సినిమాలో చూపించే ప్రేమ, ఆప్యాయత ,అనురాగాలు అంతా తుస్సేనా అని అనుకుంటున్నారట.