సీతారామ ప్రాజెక్టును తుమ్మల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వాలని ఒక రకంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్దమే చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి విభజన అంశాలు యే ఉన్నాయో వాటిలో ప్రధానంగా నదీజాలాల సమస్యను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తావించారన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలో రావటం కోసం నిర్మాణం చేసిన సీతమ్మసాగర్ బ్యారేజ్ వరకు ఈ సీజన్ లోనే కంప్లీట్ చేయ్యాలని కేసిఆర్ అధికారులకు ఆదేశించారన్నారు. ఇక్కడ 36TMC నీళ్ళు నిల్వ ఉండటం వలన మంచినీటికి గాను సాగునీటికి గాను ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూడటం కోసమే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు అని ఆయన అన్నారు.
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సజావుగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి సూచనలు మేరకు అధికారులు కష్టపడి పని చేస్తున్నారని, అందరు కలిసి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా.. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులకు పిలుపునిచ్చారు తుమ్మల.