హీరోయిన్ స్నేహకు తన భర్తతో విభేదాలు ఉన్నాయా.. నిజమేనా..?

-

టాలీవుడ్ లో అచ్చ తెలుగు హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్స్ స్నేహ. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సౌందర్య తర్వాత ఆస్థానంలో స్నేహ ఉందని చెప్పవచ్చు. తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలు అందరితో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరమై కూడా ఆడప దడపా సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తోంది. ఇక వివాహమైన తర్వాత మొదటిసారిగా వినయ విధేయ రామతో రీ ఎంట్రీ ఇచ్చింది స్నేహ. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్ను ప్రేమించి వివాహం చేసుకుంది. అలా కుటుంబ సభ్యులను ఒప్పించి 2012లో వివాహం చేసుకుంది.

కోలీవుడ్ లో కూడా క్యూట్ కపుల్స్ గా పేరు పొందారు ఈ జంట. అలా ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎక్కడికి వెళ్లినా కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండేవారు. ఇక అప్పుడప్పుడు తన భర్త పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది స్నేహ. తాజాగా స్నేహ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతొంది. అదేమిటంటే కొద్దిరోజులుగా స్నేహ తన భర్త ప్రసన్నకు దూరంగా ఉందని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం స్నేహ తన భర్త మీద కోపంతోనే దూరంగా ఉంటోంది అంటూ పలు వార్తలు వినిపిస్తూ ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడుతున్నారు. తన భర్తతో విభేదాలు రావడం వల్ల ఈమె మరొక ఇంట్లో వేరుగా ఉంటోంది అని తమిళ మీడియాలో పలు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో ఈ విషయంపై స్నేహ, ప్రసన్న కుమార్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news