బాలీవుడ్ క్లాసిక్ మూవీ అయిన షోలే లోని ఒక ఐకానిక్ డైలాగ్ ఇప్పుడు మధ్య ప్రదేశ్ లోని ఒక పోలీసు అధికారిని ఇబ్బందుల్లో పడేసింది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబువా జిల్లాలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక అధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఈ డైలాగ్ లాంటి డైలాగ్ ని ఆయన మెగాఫోన్ లో అనౌన్స్ చేస్తున్నప్పుడు కొందరు కెమెరాలలో చిత్రీకరించగా ఆ వీడియో వైరల్ అయింది. దీంతో సదరు పోలీసు అధికారికి షో-కాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ ఐన వీడియో క్లిప్‌లో కనిపించిన పోలీసు అధికారి కెఎల్ డాంగి మధ్యప్రదేశ్‌లోని జాబువా జిల్లాలోని కల్యాణపుర పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి. వైరల్ అయిన 15 సెకన్ల వీడియో లో, డాంగి తన పోలీసు జీపులో అమర్చిన మెగా ఫోన్ నుండి “సో జా బీటా నహితో గబ్బర్ ఆ జాయేగా” అనే డైలాగ్ ని కాస్త ఇంప్రూవయిజ్ చేసి కల్యాణపుర నుండి 50 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు, వారి తల్లులు నిద్ర పోవాలని లేదా డాంగి వస్తాడని హెచ్చరించాలని ఆయన అనౌన్స్ చేశాడు. అంటే తనను తాను ఒక గబ్బర్ సింగ్ తో పోల్చుకోవడంతో సీనియర్ అధికారులు సీరియస్ అయ్యారు.