ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడు కేఎల్ రాహుల్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ గా 14మ్యాచులాడి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ప్లే అఫ్స్ కి వెళ్లకపోయినా అత్యధిక స్కోరు చేయగలిగాడంటే లీగు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ ఎంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఈ ఆటగాడిపై మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ నాసర్ హుస్సేన్ ప్రశంసలు కురిపించాడు.
వైట్ బాల్ తో ఆడగల అత్యుత్తమ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకరన్ని, అతని బ్యాటింగ్ స్టైల్, మైదానం నలువైపులా ఆడగైలిగే తత్వం సహా అన్ని విషయాలు అతడిని అత్యుత్తమ ఆటగాడిగా మార్చాయని అన్నారు. ఐపీఎల్ ఆడడానికి వచ్చే యంగ్ ప్లేయర్స్ కి అతడొక మార్గదర్శకంగా నిలుస్తాడని, కేఎల్ రాహుల్ నుండి యంగ్ ప్లేయర్స్ ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు.