ఆదివారం తెల్లవారుజామున వాషింగ్టన్ డి.సి.లో బహిరంగ పార్టీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 20 మంది గాయపడ్డారు, ఒక మహిళ ప్రాణాలతో పోరాడుతుంది అని అధికారులు పేర్కొన్నారు. ఒక మ్యూజికల్ పార్టీలో ఆహారం కోసం ప్రజలు వచ్చినప్పుడు ఈ కాల్పులు జరిగాయి అని అధికారులు పేర్కొన్నారు. 17 ఏళ్ళ యువకుడు ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు అని అధికారులు వివరించారు.
ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడు అనేది స్పష్టత లేదు అని పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని అధికారులు మీడియాకు తెలిపారు. ఒక్కరికి మాత్రమే ఆరోగ్యం విషమంగా ఉందని, మిగిలిన ఎవరికి ప్రాణ హాని లేదన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇది ఒక పుట్టిన రోజు పార్టీ అని అధికారులు మీడియాకు వివరించారు. కరోన ఆంక్షలు ఉన్నా సరే పార్టీకి వచ్చారు.