ఆర్ఎంపీ డాక్టర్ ను చితకబాదిన జనసేన కార్యకర్తలు..రంగంలోకి జ‌గ‌న్

-

పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిన నేప‌థ్యంలో.. ఆర్ఎంపీ డాక్టర్‌, ఇత‌ర వైసీపీ నేత‌ల‌ను చితకబాదారు జనసేన కార్యకర్తలు. మంచిలీపట్నం తాళ్లపాలెం పంచాయితీలోని హెచ్ సత్తెనపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు గిరిధర్. దీంతో గిరిధర్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు జనసేన కార్యకర్తలు.

jagan
Jana Sena workers beat up RMP doctor

దాడి తర్వాత గిరిధర్ ను మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించారు జనసేన కార్యకర్తలు. జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వరంయోల దాడి జరిగినట్లు సమాచారం చెబుతున్నారు.
అయితే…జనసేన కార్యకర్తల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఫోన్ చేసి గిరిధర్, సతీష్ లతో మాట్లాడి ధైర్యం చెప్పారు జగన్. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న జగన్… వైసీపీ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుదామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news