వినాయక నిమజ్జనంలో టాలీవుడ్ హీరోయిన్… తీన్మార్ స్టెప్పులతో డాన్సులు

-

గణేష్ నిమజ్జన వేడుకలలో హీరోయిన్ శ్రద్ధా దాస్ పాల్గొని సందడి చేశారు. వారి అపార్ట్మెంట్ గణేశుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొని శ్రద్ధ దాస్ రోడ్డుపై డోలు వాయించి చిందులు వేశారు. స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది వైరల్ గా మారుతుంది. ఓవైపు వర్షం కురుస్తున్న ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె తనదైన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. నిమజ్జన ఉత్సవాలలో ఇదే బెస్ట్ అని ఆమె పేర్కొన్నారు.

Shraddha Das
Shraddha Das

స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలా రోడ్డుపై చిందులు వేయడం చూసి తన అభిమానులు సంతోషపడుతున్నారు. గణపతి నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా చిందులు వేస్తారు. చిన్నపిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వారి డ్యాన్సులతో ఆటలతో సందడి చేస్తారు. ఇక శ్రద్ధాదాస్ ఇలా డాన్స్ చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. చాలా బాగా తీన్మార్ డాన్స్ చేసావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news