పాలమూరు జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హాజరయ్యారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కురుమూర్తి స్వామి ఉత్సవాల సందర్భంగా కురుమూర్తి స్వామి ఆలయ సమీపంలో రూ.110 కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
కురుమూర్తి ఆలయానికి విచ్చేసిన రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు, జిల్లా యంత్రాంగం ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, నాయకులు వట్టెం శివకుమార్, గూడూరు శేఖర్, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.