ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరాముడి వారసుడని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్థి ఎవ్వరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. 100 రోజులు దాటిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయన్నారు. రేషన్ కార్డు నిబంధన పెట్టి లబ్దిదారులకు కోత పెడుతోంది. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ పై ఏం చెప్పడం లేదు. 6 గ్యారెంటీల అమలుకు రూ.5లక్షల కోట్ల బడ్జెట్ కావాలని..ఎల్బీస్టేడియంలో నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రసంగించారు ఎంపీ బండి సంజయ్.
‘రాముడు మీకు మాత్రమే దేవుడా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. అవును.. మాకు మాత్రమే దేవుడు చస్తామని తెలిసినా అయోధ్య రాముడి ఆలయం నిర్మాణం కోసం వెళ్లిన వారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలు వచ్చారా? బీఆర్ఎస్ నేతలు వచ్చారా? కమ్యూనిస్టు నాయకులు వచ్చారా? మాకు కాకుండా రాముడి పేరు చెప్పే అర్హత ఎవరికి ఉంది’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ. మరి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. వందరోజులు అయిపోయిందని ఆరు గ్యారంటీల అమలుకు ఇంకెంతకాలం పడుతుందని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇచ్చిన. హామీలు అమలు చేయకుండా ఎలా ఓట్లు అడుగుతారో చూస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.