ఆ హీరోతో సినిమా అంటే ఫుల్ జోష్ వస్తుంది : శ్రీయ

-

అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ శ్రియ. ప్రస్తుతం పెళ్లి అయినప్పటికీ కూడా యువ హీరోయిన్లకు ఎక్కడ తీసుపోకుండా తన అందాల ఆరబోతతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్గా కొనసాగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా అందరు హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ… బ్లాక్బస్టర్ విజయాలను కూడా అందుకుంది.

ఇక ఇటీవలే ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది . తాను ఒక డాన్స్ వీడియో చేయడంతో అందులో దర్శకనిర్మాతలు తనను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నాగార్జున తో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది అంటూ తెలిపిన శ్రియ నాగార్జునతో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా నాగార్జునతో కలిసి చివరిగా మనం సినిమాలో శ్రియ కనిపించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version