ఏపీ డిప్యూటీ సీఎం నీతులు చెప్పడం వరకే.. అవి ఆచరణలో ఉండవు అని వైసీపీ నాయకురాలు శ్యామల అన్నారు. గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు . కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్… ఆ రోడ్డును సీజ్ చేయాలి కదా అని ఆమె ప్రశ్నించారు.
అలాగే సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చెయ్యండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతో కనీసం వెళ్లి పరామర్శించారా.. అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా అని అడిగారు శ్యామల.