నాని ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి అదిరిపోయే అప్డేట్..

-

నాని హీరోగా న‌టించిన ఏ సినిమా అయినా మినిమమ్ హిట్ గ్యారంటీ. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు నాని. అయితే.. కరోనా కారణంగా డీలాపడ్డ టాలీవుడ్‌ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని మూవీస్‌ ఇప్పటికే షూటింగ్స్‌ ప్రారంభించగా.. మరికొన్ని మూవీస్‌ సిద్ధమౌవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాని నటిస్తోన్న ”శ్యాం సింగ‌రాయ్” మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ట్యాక్సీ వాలా ఫేం రాహుల్‌ సంకీర్త్యన్ ద‌ర్శక‌త్వంలో శ్యాం సింగ‌రాయ్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే… కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయిన ఈ మూవీ .. తాజాగా ఇవాళ్టి నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సార‌థ్యంలో ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో 10 ఎక‌రాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌క‌తా సెట్ భారీ వ‌ర్షాల కార‌ణంగా దెబ్బతింది.

ఆ సెట్‌ను పున‌ర్నిర్మించి కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను ఇప్పుడు తెర‌కెక్కిస్తున్నారు. నాని స‌హా ఇత‌ర తారాగ‌ణం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా మేకర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో నాని లుక్ ఆక‌ట్టుకుంటోంది. ఈ లెటెస్ట్‌ లుక్ మూవీ అంచనాలను మరింత పెంచింది. కాగా… ఈ మూవీలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version