తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు వస్తాయని అంతా అనుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి revanth reddy టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటించడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌ను పాత ప్లేస్‌లోకి తీసుకొస్తారనే ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఊపందుకుంది. నిజానికి తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడకముందు కాంగ్రెస్ అప్రతిహతంగా పోరాడింది.
కానీ కేసీఆర్ తెలివిగా ఆలోచించి కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలను ఆసరాగా చేసుకుని అందరినీ విడదీశారు. కొందర్ని తన పార్టీలోకి తీసుకుని మిగతా వారికి అడ్రస్ లేకుండా చేశారు. దీంతో అసలు ఆ పార్టీ ప్రజల తరఫున ఏ సమస్య మీదైనా పోరాడుతుందా అనే అనుమానాలు కలిగేంత వరకు వెళ్లిందంటే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ ఎదిగింది. అంతే కాదు తామే టీఆర్ ఎస్‌కు ప్రతిపక్షమని ప్రకటించుకునే దాకా వెళ్లింది. ప్రస్తుతం ఆ పార్టీ కార్యకర్తులు అన్ని సమస్యలపై నిర్వి రామంగా పోరాడుతూ పార్టీపై నమ్మకాన్ని పెంచుతున్నారు. మరి ఇలాంటి సమయంలో రేవంత్ కు పగ్గాలు ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్‌ను మళ్లీ ప్రతిపక్షంగా నిలబెడుతారనే ప్రచారం ఊపందుకుంది. మరి ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.