యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ వీడియో వైరల్ గా మారింది. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టారు ఎస్ఐ.

ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని.. యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో యూరియా కోసం రోడ్డెక్కి రైతుల ధర్నా చేసారు. త్రిపురారం మండల కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరారు రైతన్నలు.
సిద్దిపేట – నంగునూరు PACS వద్ద యూరియా కోసం బారులు తీరారు రైతులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట మండల కేంద్రంలో.. యూరియా కోసం రైతుల ఆందోళనలు చేస్తున్నారు. మాకు సరిపడా యూరియా ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసారు రైతులు.
యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ
యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం
గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ
ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని.. యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతుల ఆవేదన pic.twitter.com/IG0MHx211v
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2025