హిందూ శాస్త్ర కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి తాను చేసిన కర్మల ఫలాన్ని అనుభవించడానికి పునర్జన్మ పొందుతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి చెప్పినట్టుగా ఆత్మకి నాశనం లేదు. అది ఒక శరీరం నుండి మరో శరీరానికి మారుతుంది. అయితే మన శత్రువులు మన కుటుంబంలోనే జన్మించే అవకాశం ఉందా అనేది చాలామందికి ఒక పెద్ద ప్రశ్న. ఇది ఎక్కువ సార్లు వింటూ వుంటాము. దీనికి సమాధానం కర్మ బంధం, రుణానుబంధం అనే రెండు కీలకమైన అంశాలలో దాగి ఉంటుంది.
మన పూర్వజన్మలో మనం చేసిన కర్మల వల్ల ఏర్పడిన బంధాలే మనల్ని ఒకరితో ఒకరిని కలుపుతాయి అది తండ్రి, తల్లి, భర్త, బిడ్డ, భార్య, స్నేహితుడు, శత్రువు,ఇలా మన జన్మలో మనతో ముడిపడిన ప్రతి బంధం మనకి పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితంగానే కలుగుతాయి. ఒక శత్రువు మనకు హాని చేస్తే అతనికి మనం కి మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా కర్మ బంధం ఏర్పడుతుంది. ఈ బంధం తీర్చుకోవడానికి అంటే ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఆ జన్మలో వారు విడిపోయినా మళ్లీ జన్మలో వాళ్ళు కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇది బంధువులుగా, స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా మనతో బంధాన్ని ఏర్పరచవచ్చు. కర్మఫలం తీర్చుకోవడం అంటే ప్రతీకారం మాత్రమే కాదు, ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ ద్వేషం, సాయం లేదా హాని ఇవన్నీ కర్మ ఫలాలే.

భగవద్గీతలో కర్మఫలం అనుభవించడం అనేది ఒక ఆత్మీయ ప్రక్షాళనగా వర్ణించబడింది. శత్రువు మన దగ్గర జన్మించడం వల్ల గత జన్మలో జరిగిన ఖర్మ బంధాలను సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక శత్రువు తిరిగి మన కుటుంబంలో జన్మించినప్పుడు వారిపై మనం కోపం పెంచుకోకుండా వారిని అర్థం చేసుకొని వారికి సహాయం చేయగలిగితే ఆ కర్మ బంధం తెగిపోతుంది. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
మహాభారతంలో కూడా దీనికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కౌరవులు, పాండవుల మధ్య ఉన్న శత్రుత్వం కేవలం ఆ జన్మకే పరిమితం కాదు. అది వారి పూర్వజన్మల కర్మ ఫలం. కాబట్టి మన శత్రువులు మన కుటుంబంలో జన్మించడం అనేది కేవలం ప్రతీకారం కోసం కాదు, అది గత గత కర్మల ను సరి చేసుకోవడానికి ప్రకృతి మనకి ఇచ్చిన ఒక అవకాశం. దీని అర్థం చేసుకొని దయా ప్రేమతో వారిని స్వీకరించినప్పుడు మనం కర్మ బంధాల నుంచి విముక్తి పొందుతాం. భగవంతుడు మన శత్రువులని మన ఇంట్లో పుట్టించడానికి కారణం మన కడుపున పుడతారు కాబట్టి ప్రేమ అభిమానంతో వారిని పెంచుతాం. శత్రువుని కూడా దైవిక భావంగా భావిస్తే ద్వేషం మాయమవుతుంది. ఇదే జీవిత చక్రం దీన్ని
భక్తి, జ్ఞానం ద్వారా దాటుతాడు.
మన శత్రువు మన ఇంట్లోనే పుడతాడు అనే ఆలోచన భయంకరంగా అనిపించవచ్చు. కానీ ఇది దైవిక ప్రేమ, రహస్యం మనమంతా ఒకే పరమాత్మ లో భాగంగా జీవిస్తున్నాం. శత్రువు కుటుంబంలో జన్మించడం కరుణా,క్షమ నేర్పే పాఠం గా భగవద్గీత చెప్తుంది. గీత బోధలు అనుసరిస్తే జీవితం ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది.
(గమనిక: పైన వివరించింది కేవలం ఒక ఆధ్యాత్మిక సమాచారం పాఠకులకు అందించాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పటం జరిగింది.దీని నిజమైన సాక్షాలు లేవు.)